
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1164 లో.. ఐశ్వర్య ఆఫీస్ లో ఏం చేసిందో అదంతా ఇందుతో చెప్తుంది శృతి. దీంతో ఇందు, అపర్ణ, రాజు కోప్పడతారు. రాజు ఆఫీసుకు వెళ్లి నిలదీద్దామంటే ఇందు వద్దు అంటుంది. ఇంటికి వచ్చాక ఐశ్వర్యను నిలదీస్తే నా కంపెనీ నా ఇష్టం ఎవరు జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
మరోవైపు అపర్ణ, సుభాష్ బాధపడుతుంటే వాళ్లిద్దరూ ఇంటి, కంపెనీ వ్యవహారాల్లో పడి సరదాగా ఉండటమే మర్చిపోయారు.. అందుకోసం మనం ఒక నాటకం ఆడదామని సుభాష్ చెప్తాడు. ఇందు రాసినట్టుగా ఒక లవ్ లెటర్ రాసి రాజు చదివేలా, రాజు రాసినట్టుగా ఒక లెటర్ రాసి ఇందు చదివేలా చేద్దామని ప్లాన్ వేస్తాడు. పేపర్ తీసుకో నేను చెప్తా అంటూ నీతో పర్సనల్ గా ఒంటరిగా మాట్లాడాలి రాత్రి 12 గంటలకు గార్డెన్ లోకి రా అని అపర్ణతో రాయిస్తాడు.
ఆ లెటర్ తీసుకెళ్లి రాజు, ఇందు చదివేలా చేస్తుంది. ఆ లెటర్లు చదివిన రాజు, ఇందు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఆ లెటర్స్ ను పారేస్తారు. అవి ఒకటి నందు ముందుకు.. ఒకటి వెంకట్ ముందుకు పడతాయి. వాళ్లు చదివి పడేస్తారు. అందులో ఒకటి పనిమనిషి దగ్గరకు ఒకటి శేషు దగ్గరకు పడతాయి. వాళ్లు చదువుకుని ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. తర్వాత వాళ్లు పడేస్తే అవి ఒకటి రేఖ దగ్గర, ఒకటి భూషణ్ దగ్గర పడతాయి. వాళ్లు లెటర్స్ చదివి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇక రాత్రి 12 గంటలకు రాజు గార్డెన్ లో వెయిట్ చేస్తుంటే ఇందు వస్తుంది. అప్పుడే రూంలో శేషు నిద్రలేచి టైం చూసి బయటకు వెళ్తుంటాడు. భ్రమరాంబ కూడా సైలెంట్ గా శేషు వెనకాలే వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

